ఆనందపురంలో అగ్నిప్రమాదం
విశాఖ: భీమిలి సమీపంలోని ఆనందపురంలో సాయి రేఖ స్టూడియో దగ్గర ఉన్న ఒక టిఫిన్ సెంటర్‌లో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షాప్‌లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తినష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.