'ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం'

PDPL: అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం అంతర్గాం మండలం కుందనపల్లి, పెద్దంపేట గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పేదలకు తెల్ల రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.