త్వరలో జిల్లాల్లో 274 మొబైల్ అంగన్వాడి కేంద్రాలు
HYD: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అంగన్వాడీలు లేని పట్టణ మురికివాడలను గుర్తించి, అక్కడ పిల్లల సంరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. శిశు సంక్షేమ శాఖ రూ.4 కోట్ల వ్యయంతో 274 మొబైల్ అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మొబైల్ కేంద్రాల ద్వారా బాలల పోషణ, ఆరోగ్య సేవలు, ప్రీ-స్కూల్ విద్యను అందించనున్నారు.