వెంకటగిరిపాళ్యంలో టీడీపీ నాయకుడు మృతి
సత్యసాయి: పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం గ్రామంలో టీడీపీ నాయకుడు, మాజీ డీలర్ వెంకటేశులు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.