బిచ్కుందలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
KMR: బిచ్కుంద మార్కెట్ కమిటీ యార్డులో ప్రొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రారంభించారు. క్వింటాలకు రూ. 7,721 మద్దతు ధర కల్పిస్తున్నామని, రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాలనే ఆశ్రయించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఆయన పలు వివాహా వేడుకల్లో పాల్గొన్నారు.