ఎమ్మిగనూరు టీడీపీ మండల కమిటీ ఎన్నిక

KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీని మరింత బలోపేతం చేసేలా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు మండల ప్రధాన కమిటీని బుధవరం నియమించారు. టీడీపీ మండల ప్రధాన కమిటీ అధ్యక్షుడిగా తిమ్మాపురానికి చెందిన వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడిగా కందనాతికి చెందిన కేశన్నను నియమించారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శిగా పర్లపల్లికి చెందిన రాజేష్‌ను నియమించారు.