రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్న ధనుష్?

రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్న ధనుష్?

స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్నట్లుగా ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. దాదాపు ఈ కాంబినేషన్ ఖరారైనట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, హీరోగా, దర్శకుడిగా బహుముఖ పాత్రలు పోషిస్తున్న ధనుష్, రజినీకాంత్‌తో సినిమాపై ఎప్పుడు స్పష్టత ఇస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.