బ్రాండ్ పేరు మీద నకిలీ బియ్యం విక్రయం
BDK: పినపాక మండలం, భూపాలపట్టణం గ్రామంలో ఇటీవల కొంతమంది వ్యక్తులు "BLUE DIAMOND - Premium Quality Sortex Rice” సంచులను తీసుకుని ఇంటింటికీ తిరుగుతూ అమ్మిన ఘటన స్థానికులలో పెద్ద ఎత్తున ఆగ్రహం రేపింది. అయితే సంచి పై ఉన్న బ్రాండ్‌కు లోపల ఉన్న బియ్యానికి ఎలాంటి సంబంధం లేకుండా తక్కువ స్థాయి స్టోర్ బియ్యం నింపి విక్రయించినట్లు గ్రామస్తులు గుర్తించారు.