ఉరుమడ్లలో కాంగ్రెస్‌లోకి చేరికలు

NLG: చిట్యాల మండలం ఉరుమడ్లలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి ఉరుమడ్లలోని వారి నివాసంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాగర్ల యాదయ్య, ఉయ్యాల యాదయ్య, జనపాల కుమార్, చిక్కుడు సంతోష్, శ్రీదేవి, రమ్య, రాము తదితరులు పార్టీలోకి చేరారు.