ఆన్‌లైన్ బెట్టింగ్.. ఇంట్లో నుంచి పారిపోయిన విద్యార్థి
PLD: మాచర్లలో ఓ ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన అతడు భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇటీవల తల్లి ఖాతాలోని రూ.3 లక్షలను కూడా బెట్టింగ్‌లో పెట్టి ఓడిపోయాడు. బ్యాంకుకు వెళ్లిన తల్లి.. ఖాతాలో డబ్బులు లేకపోవడంతో కుమారుడిని నిలదీసింది. దీంతో ఆ బాలుడు 2రోజుల క్రితం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఇంట్లోంచి పారిపోగా, కేసు నమోదు చేశారు.