ఎమ్మెల్యేపై సీఎం ఆగ్రహం

ATP: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అభిమానులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం.