సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

నల్గొండ మండలం పెద్ద సూరారం గ్రామానికి చెందిన ముసుకు లక్ష్మికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రూ.20 వేల విలువగల CMRF చెక్కు మంజూరైంది. శుక్రవారం మాజీ ఎంపీటీసీ పెండెం రత్నమాల పాండు చేతుల మీదుగా లబ్ధిదారురాలికి ఈ చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిళ్లి యాదగిరి, గుండె వెంకన్న, ముసుకు బిక్షం, జంజీరాల ప్రకాష్, పెండెం జగన్ తదితరులు పాల్గొన్నారు.