అమరావతిని చంద్రబాబు చంపేశారు: పేర్నినాని
AP: సీఎం చంద్రబాబుపై మాజీమంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. 'ఆరోగ్యం బాగోలేదని బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ ఆసుపత్రికి వెళ్లలేదు. అధికారులను బెదిరించి, అధికారాన్నిఅడ్డం పెట్టుకుని కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. అమరావతిని చంద్రబాబు చంపేశారు. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వైజాగ్ వెళ్తుంటే ఇక అమరావతిలో భూములకు రేట్లు ఎలా వస్తాయి?' అని ప్రశ్నించారు.