ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
MHBD: మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని MLA డా.భూక్య మురళీ నాయక్ అన్నారు. MHBD మండలం జంగలిగొండ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో MLA ముఖ్య అతిథులుగా పాల్గొని చీరలు పంపిణీ చేశారు. ఆడబిడ్డలకు ఒక అన్నలా, తండ్రిలా చీరలు అందించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.