రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

WGL: రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలోని గిర్మాజీపేటలో చోటు చేసుకుంది. జీఆర్పీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. వరంగల్- చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య 45-50 ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నీలం, నలుపు రుంగు చెక్స్ లుంగీ, నీలం రంగు చొక్కా ధరించినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని MGM ఆసుపత్రి మార్చురీకి తరలించారు.