'యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలి'
BDK: భద్రాచలం వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా ఆహార భద్రతా అధికారి శరత్ తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున,హోటళ్లలో నాసిరకమైన ఆహార వస్తువులు అందించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గురువారం ఆయన పట్టణంలోని దేవస్థానం రోడ్డులోని హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.