నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM: మధిర మండలం ఇల్లెందులపాడు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు మధిర రూరల్ ఏఈ ఎస్.మైథిలి తెలిపారు. దెందుకూరు ఫీడర్ పరిధిలోని దెందుకూరు, తొండల గోపవరం, తొర్లపాడు, ఖమ్మంపాడు, చిలుకూరు గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.