ఎంపీ కావ్య బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఎంపీ కావ్య బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

WGL: ఎంపీ కడియం కావ్య ప్రవేశపెట్టిన “అనాథ వితంతువులు, ఒంటరి మహిళల (రక్షణ, పునరావాసం, సంక్షేమం) బిల్లు–2025”కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 117(3) ప్రకారం బిల్లును పరిశీలించేందుకు రాష్ట్రపతి సిఫార్సు చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి శుక్రవారం లేఖ ద్వారా తెలియజేశారు.