కల్తీ పచ్చళ్ల తయారీ గోదాంపై ఆకస్మిక దాడి
HYD: కల్తీ పచ్చళ్లను తయారు చేస్తున్న గోదాంపై కుల్సుంపురా పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో బూజుపట్టి ఉన్న పచ్చళ్ల నిల్వలను గుర్తించారు. 78 డ్రమ్ముల బూజుపట్టిన పచ్చళ్ల నిల్వలను సీజ్ చేసి, నాణ్యతలేని పచ్చళ్లను తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నాణ్యతలేని ఆహార పదార్థాల తయారీదారులపై కఠిన చర్యలు తప్పవని CI రాములు హెచ్చరించారు.