VIDEO: ప్రాణాల మీదకి తెచ్చిన ట్యాంకర్ క్లీనింగ్
AKP: నక్కపల్లి హెట్రో డ్రగ్స్ కంపెనీలో ఎండీసీ కెమికల్‌ను అన్‌లోడ్ చేసిన అనంతరం ఎస్ రాయవరం మండలం గోకులపాడు వద్ద లారీని వాటర్ సర్వీసింగ్‌కు తీసుకువచ్చారు. ట్యాంకర్ లోపల క్లీన్ చేసేందుకు వాటర్ సర్వీసింగ్ సెంటర్ యజమాని పీబీవీఎస్ఎం రాజు, పిరియాజ్ అనే వ్యక్తి దిగి స్పృహ కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రోప్ సాయంతో బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు.