నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

MBNR: జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ విజయేంద్ర బోయి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ పారదర్శకంగా ఉండాలని అన్నారు. నామినేషన్ ఫారాలు తీసుకున్నవారు వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు.