'గంజాయి, నాటుసారా అమ్మితే చెప్పండి'

ప్రకాశం: చీమకుర్తి మండలం బండ్లమూడిలో ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ M.సుకన్య మరియు ఎస్ఐ నగేష్ సిబ్బందితో కలిసి గంజాయి, డ్రగ్స్, నాటుసారాయి, వినియోగం వలన కలుగు నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అదేవిధంగా ఎక్కడైనా గంజాయి, నాటుసారా వంటివి అమ్ముతున్నట్లయితే వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.