ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
CTR: కుప్పం మండలం నడుమూరు ఆదర్శ కళాశాలలో 2026-27 ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలను నేరుగా సంప్రదించాలన్నారు.