ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం

అన్నమయ్య: మదనపల్లిలో ‘నా భారత్ నా ఓటు’ నినాదంతో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అవగాహన ర్యాలీని ప్రారంభించి యువత ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. కొత్త ఓటర్లకు ఐడీ కార్డులు పంపిణీ చేయగా, సీనియర్ సిటిజన్లను సన్మానించారు. పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.