పారిశుధ్య కార్మికుల బకాయి వేతనాల కోసం ధర్నా

సత్యసాయి: గాండ్లపెంట మండలంలో పారిశుధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో బకాయి వేతనాల కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. సుమారు 18 నెలల వేతనాల చెల్లింపు బకాయిలున్నాయని తక్షణమే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో, ఈవోఆర్డీ సునీత, పంచాయతీ కార్యదర్శులు ఈ నెల 20 లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.