VIDEO: వైభవంగా అమ్మవారికి అభిషేకాలు

శ్రీకాకుళం పట్టణం బలగ ప్రాంతం నాగావళి నది తీరాన కొలువైన శ్రీ బాల త్రిపుర కాలభైరవాలయంలోని బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠం గురూజీ జగన్ నేతృత్వంలో అమ్మవారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.