హనుమాన్ శోభాయాత్రకు రావాలని ఎమ్మెల్యేకి ఆహ్వానం

గద్వాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 12న హనుమాన్ శోభాయాత్రను విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు వీహెచ్‌పీ బజరంగ్ దళ్ సభ్యులు కార్యాలయంలో శోభయాత్రకు రావాలని ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.