VIDEO: శ్రీరామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
JGL: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ వేదపండితులు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చనలు, లింగాష్టకం, ధూపదీప, కర్పూర హారతులు సమర్పించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వయంగా అభిషేకాలు చేశారు.