64 ఏళ్ల వయసులో రెండు బంగారు పతకాలు
శ్రీలంకలో జరిగిన ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 64 ఏళ్ల వృద్ధుడు సత్తా చాటారు. మహారాష్ట్రకు చెందిన అశోక్ దీక్షిత్ రెండు బంగారు పతకాలను గెలుచుకున్నారు. ఇప్పటివరకు 202 పోటీల్లో పాల్గొన్న ఆయన 113 బంగారు, 24 వెండి, పలు కాంస్య పతకాలను సాధించారు. 44 ఏళ్లుగా అశోక్ పవర్ లిఫ్టింగ్ సాధన చేస్తున్నారు. 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్' గుర్తింపు కూడా లభించింది.