'వరి ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలి'

'వరి ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలి'

BHNG: రబీ సీజన్‌కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ, మార్కెట్, రవాణా, గ్రామీణాభివృద్ధి, కో-ఆపరేటివ్, మిల్లర్లు తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.