బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం

బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని మరో సినిమా చేయనున్నాడు. 'NBK-111' వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీలో బాలయ్య మహారాజ పాత్రలో కనిపించనున్నారు. ఇక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. కాగా, గతంలో బాలయ్య, గోపీచంద్ కాంబోలో 'వీరసింహారెడ్డి' మూవీ తెరకెక్కింది.