రాజన్నను దర్శించుకున్న నాయకులు అధికారులు

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి. గీతేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఘన స్వాగతం పలికడ్డారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అద్దాల మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించగా, ప్రసాదాలు అందజేశారు.