ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NRPT: జిల్లాలో నిర్వహించే స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సోమవారం పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు మున్సిపాలిటీ నుంచి నర్సిరెడ్డి చౌరస్తా వరకు ర్యాలీ అనంతరం అక్కడే శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.