సోమిడిలో మొదటిసారి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
MHBD: రైతు అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమిడిలో గురువారం మొదటిసారిగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల ఇబ్బందులు గుర్తించి గ్రామంలోనే కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. ఇకపై రైతులు గ్రామంలోనే ధాన్యం విక్రయించవచ్చని పేర్కొన్నారు. రైతు బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుందని MLA నొక్కి చెప్పారు.