చల్లబడ్డ వాతావరణం.. కాసేపట్లో వర్షం

HYD: మహా నగర వ్యాప్తంగా వాతావరణం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా చల్లబడింది. దాదాపు నగరమంతా ఆకాశం మేఘావృతమైంది. ఆ నేపథ్యంలో మరి కాసేపట్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని HYD వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం 2 గంటల తర్వాత మారిపోయింది. బయటకు వెళ్లేవారు పలు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్.