'ఏప్రిల్ నాటికి ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలి'
SKLM: గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి, ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. హీరమండలం మండలంలో శుక్రవారం ఆయన పర్యటించి, జలాశయానికి నీటిని తరలించే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.