VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి
తిరుమల శ్రీవారిని మంత్రి అనగాని సత్యప్రసాద్, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. భావి తరాలకు మేలు చేసేలా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ సీఐఐ సమ్మిట్ ద్వారా రూ. 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.