'పోలీసు కుటుంబం మంచి సోదరుడుని కోల్పోయింది'
SRPT: రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృత దేహాన్ని జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోసందర్శించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. పోలీసు కుటంబం మంచి సోదరుడుని కోల్పోయిందని భావోద్వేగానికి గురయ్యారు.