మచిలీపట్నంలో పాలాభిషేకం

మచిలీపట్నంలో పాలాభిషేకం

కృష్ణా: మచిలీపట్నం S.N. గొల్లపాలెం నుండి మార్కెట్ యార్డు వరకు బుధవారం మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో 250 ట్రాక్టర్లతో కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. “అన్నదాత సుఖీభవ” పథకం రైతుల అభ్యున్నతికి దోహదం చేసిందని పాల్గొన్న వారు తెలిపారు. ర్యాలీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతులు, ప్రజలు, నేతలు ఉత్సాహంగా నినాదాలు చేశారు.