కలెక్టర్ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం

MDK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, మతనాయకులు, మండప నిర్వాహకులు తమ సందేహాలు, అభ్యర్థనలను తెలిపారు. కలెక్టర్ పలు సూచనలు చేశారు. విగ్రహాల ప్రతిష్టాపన కోసం ఆన్‌లైన్ వివరాల నమోదు చేసుకోవాలని సూచించారు.