VIDEO: విశాఖలో కాజల్ అగర్వల్
VSP: సినీ నటి కాజల్ అగర్వాల్ విశాఖపట్నంలో సందడి చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం నగరంలోని పలు అందమైన ప్రదేశాల్లో ఆమె పాల్గొంటున్నారు. షూటింగ్ స్పాట్‌లకు అభిమానులు భారీగా తరలివస్తుండగా, వారికి అభివాదం చేస్తూ ఉత్సాహం నింపుతున్నారు. సముద్రతీర నగరమైన విశాఖలో షూటింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.