VIDEO: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ
ELR: కైకలూరు మండలం పల్లెవాడ శివారు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నుంచి నిడదవోలుకు ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ట్రాక్టర్ డ్రైవర్ వాహనంపై లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.