మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు

KKD: నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని కోటనందూరు ఎస్సై టి.రామకృష్ణ హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాత్రి పెట్రోలింగ్ గస్తీని ముమ్మరం చేసామన్నారు. యువత రోడ్లపై మద్యం తాగి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.