పరిశుభ్రతే లక్ష్యం: మేయర్ నీరజ
KMM: ఖమ్మం నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రకటించిన 99రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేస్తామని ఖమ్మం మేయర్ నీరజ పిలుపునిచ్చారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంతో పాటు 26, 50వ వార్డులలో నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.