మణిపుర్ ప్రజలారా.. మీ వెంట నేనున్నా: మోదీ

మణిపుర్ దేశానికే మణి వంటిదని ప్రధాని మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యమాలున్నాయని చెప్పారు. 'ప్రస్తుతం ఇక్కడ శాంతి నెలకొంటోంది. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. మణిపుర్ ప్రజలారా.. మీ వెంట నేనున్నా. రాష్ట్రంలో 7 వేల కొత్త ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇక్కడి ప్రజల మేలు కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది' అని మోదీ పేర్కొన్నారు.