VIDEO: పంటలపై జింకల గుంపు.. రైతుల ఆవేదన
NRPT: మరికల్ మండలం పసుపుల శివారులో జింకల గుంపులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ పంట పొలాలపై పడి చేసి వరి, కూరగాయల పంటలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నాయి. సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో జింకలు నాశనం చేయడంతో భారీగా నష్టపోతున్నామని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి, జింకలను అడవికి తరలించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.