'అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించాలి'

'అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించాలి'

NRPT: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ వినీత్‌తో కలిసి పాల్గొన్నారు. అట్రాసిటీ కేసులను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.