VIDEO: కాటన్ అసోసియేషన్ సభ్యుల నిరసన
KMR: మద్నూర్‌లో సోమవారం కాటన్ అసోసియేషన్ సభ్యులు జిన్నింగ్ మిల్లు గేటు మూసి నిరసన చేపట్టారు. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 సమస్యను పరిష్కారం అయ్యే వరకు సీసీఐ, ప్రైవేటులో నిరవధికంగా పత్తి కొనుగోళ్లు చేయమని స్పష్టం చేశారు. మిల్లులో నిబంధనలు లేకుండా సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ కాకాని, మధుకర్, గురురాజ్ చిద్రవార్ పాల్గొన్నారు.