VIDEO: పుంగనూరులో దంచుకొట్టిన వర్షం

పుంగనూరు పట్టణంలో కొన్ని రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట సేపు వర్షం పడటంతో రోడ్లు అన్నీ వర్షపు నీటితో పొంగిపొర్లాయి. దీంతో తోపుడు బండ్ల వ్యాపారస్థులు, ప్రయాణికులు, వాహనదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు