రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

MDK: చౌటకూర్ మండలం కొర్పోల్ వద్ద నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొర్పోల్ గ్రామానికి చెందిన తునికి శివచందర్ (48) ఆందోల్ మండలం తాలేల్మలోని తన అత్తగారింటి నుంచి స్వగ్రామానికి బైకుపై శనివారం వస్తున్నారు. ఈ క్రమంలో కొర్పోల్ సమీపంలో బైక్ అదుపుతప్పి రేలింగ్ గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో శివచందర్ అక్కడికక్కడే మృతి చెందారు.